గతంలో ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకునే వారు. ఒక స్త్రీ కోసం యుద్ధాలు జరిగిన చరిత్ర కూడా ఉంది. అయితే కాలం మారింది. ప్రస్తుతం అబ్బాయి కోసం అమ్మాయిలే కొట్టుకుంటున్నారు. రోడ్లు ఎక్కి మరీ ఫైటింగ్‌లు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ghar Ke Kalesh అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం గొడవ పడుతున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. ఆ గొడవకు కారణమైన అబ్బాయి ఇద్దరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కొట్టుకుంటున్న వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ అమ్మాయిలు అతడి మాట వినలేదు. ఆ అమ్మాయిల ఫైటింగ్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.