Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఉమ్మడి కరీంనగర్ జిల్లా ALL INDIA ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి గా మానుపాటి...

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ALL INDIA ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి గా మానుపాటి రవి

హైదరాబాద్ లో జరిగిన ALL INDIA ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సమితి ఏ ఐ వై హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలానికి చెందిన కరీంనగర్ కోర్టులో అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతున్న మానుపాటి రవి ని జిల్లా అధ్యక్షులుగా, కరీంనగర్ పట్టణానికి చెందిన ఆదివాసి ఎరుకల ముద్దుబిడ్డ బిజిలి శ్రీనివాస్ ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరూ ఎరుకల సమాజం కోసం ఎరుకల హక్కుల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల అధ్యక్ష కార్యదర్శులను నియమించి సంఘాన్ని బలోపేతం చేసి ఎరుకల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయంగా ఎరుకల ప్రజలు ఎదిగటానికి కృషి చేయాలని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయల సాయిలు మాట్లాడుతూ ఎరుకల హక్కుల పోరాట సమితి ఎరుకల ప్రజలకు నిరంతరం కృషి చేస్తనని అన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా నియమకమైన మానుపాటి రవి మాట్లాడుతూ ఎరుకల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు వలిగి ప్రభాకర్ మార్గదర్శకత్వంలో ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు వలిగి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి కిషన్, ఎరుకల వొలుగుత్తుల పోచయ్య, వోలుగుమాను బలరాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపినారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments