కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని పాండు బస్తి నివాసి ఇటీవల పరమపదించిన BRS నాయకుడు తమ్మిశెట్టి బొంబాయి వెంకటేష్ దశ దిన కర్మ రేపు నిర్వహించనున్నట్లు తెలిపిన కుటుంబ సభ్యులు అతని జ్ఞాపకాలను ఇంక్విలాబ్ టీవీ తో పంచుకున్నారు.
మా హృదయ పలకలపై
చెక్కిన సజీవ శిల్పం మీ రూపం,
అనురాగానికి చిరునామా నీ హృదయం
మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం…. నడిచిన ప్రతి దారి సదాశయం
చేరిన ప్రతి గమ్యం స్ఫూర్తి శిఖరం… మీరే మాకు మార్గదర్శి
ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి.. జీవన జ్యోతి గా ఆఖరి వరకు దారి చూపావు…
అలసి సొలసిపోయి…. విశ్రమించిన… మీ పాదాలకు
మా హృదయ పూర్వక నివాళులు అర్పిస్తూ….
నీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ…
మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ శోకతప్త
హృదయాలతో మీ బంధువులు, కుటుంబ సభ్యులు.