విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది జిల్లా యంత్రాంగం. కలెక్టరేట్ లో సీపీఓ ఆఫీస్ కు సమీపంలో పాత ట్రెజరీ ఆఫీసు ఎదురుగా ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభించబడింది. ఎన్నికల కంట్రోల్ రూం నుండి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ను నేడు తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఎలెక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంటింగ్ మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మనేజ్మెంట్ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి సిబ్బందితో పని చేయాలని, అందుకు తగ్గ కంప్యూటర్స్, టి వి లు, ఇతర అవసరాలన్నింటిని ఆదివారం సాయంత్రానికే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
విజయనగరం కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్
RELATED ARTICLES