స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమములో భాగంగా ఈరోజున ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వావిలాలఆవరణలో డాక్టర్ మహోన్నతాపటేల్, ఎంపీడీఓ భీమేష్, ఎంపీఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి కుండలు, గోలాలు, కూలర్ల, ప్లాస్టిక్ గ్లాస్లలో, కొబ్బరి చిప్పలలో వున్న దోమల లార్వాలను గుర్తించి నీటిని పారవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గర్భవతుల ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసావానంతర ఆరోగ్య సంరక్షణ సేవల గురించి ప్రతిష్టత్మాకంగా ప్రవేశపెట్టిన శుక్రవారం సభ ను ఈరోజు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సభను గర్భవతులకు మరియు పాలిచ్చే తల్లులకు నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మహోన్నత పటేల్ మాట్లాడుతూ, గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం వరకు గర్భవతులు తీసుకోవలసిన జాగ్రతలను క్లుప్తంగా వివరించి చెప్పారు. గర్భవతులు మంచి పోషకహారం తీసుకోవాలన్నారు. ఐరన్ లభించే ఆకుకూరలు, పండ్లు, గ్రుడ్లు, బెల్లం మరియు పాలు తీసుకోవాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, తల్లికి, బిడ్డకి తల్లిపాల వల్ల కలిగే లాభాలా గురించి వివరంగా చెప్పారు. గర్భవతులు ప్రభుత్య ఆసుపత్రిలలోనే ప్రసవం కావాలన్నారు. ప్రసవం వరకు నాలుగు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని సూచించారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే హాస్పిటల్ కి వచ్చి, తగిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. వావిలాల, పాపక్కపల్లి, నగరం మరియు నాగారం గ్రామాల గర్భవతులు, పాలిచ్చే తల్లులు శుక్రవారం రోజున సభకు వచ్చారు. ఈ కార్యక్రమములో ఎంపీడీఓ భీమేష్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ శబానా, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నవీన్, అంగన్వాడీ సూపర్ వైజర్ పద్మ, హెల్త్ సూపర్ వైజర్ సదానందం, గ్రామకార్యదర్శి రాము, హాస్పిటల్ సిబ్బంది, ఏఎన్ఎం రమా, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా కార్యకర్తలు, గర్భవతులు పాల్గొన్నారు..