రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి నేతృత్వంలో నిజాంబాద్ జిల్లాలోని అంకాపూర్ కు వ్యవసాయ విజ్ఞాన యాత్రకు బయలుదేరిన రైతులు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడం, పంట మార్పిడి వ్యవసాయ విధానం, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించడం, సాధించిన దిగుబడిని మార్కెటింగ్ చేయడం ఇలాంటి అంశాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జంగటి సత్తయ్య, ల్యాగల సతీష్, నేవురీ వెంకట నరసింహారెడ్డి, కనకట్ల సుధాకర్, గండ్ర ప్రభాకర్ రావు, గోగురి ప్రభాకర్ రెడ్డి, సంఘ సెక్రటరీ కిషోర్ కుమార్, బుర్కా ఎల్లం ch శ్రావణ్ సంఘ సిబ్బంది కలసి వెళ్లారు.