Sunday, November 8, 2026
spot_img
HomeTELANGANAసర్వే నెంబర్ 157/1 లోని 8 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే BRS:...

సర్వే నెంబర్ 157/1 లోని 8 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే BRS: ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బుధవారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డు కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నవ కంటోన్మెంట్ నిర్మాణం కోసం పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో CEO అరవింద్ కుమార్ ద్వివేది, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు ఎమ్మెల్యే శ్రీగణేష్. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. కంటోన్మెంట్‌లోని విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే గత బీఆర్ఎస్ నాయకులని ఇందిరమ్మ ఇళ్ల కోసం 2025 జూలైలో సర్వే నెం.157/1 లోని 8 ఎకరాల భూమిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తాను వినతి పత్రం అందజేశానని తెలిపారు.

50 కోట్ల లంచం – కేటీఆర్ పాత్ర:
2023 జూన్‌లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి, స్వయంగా కేటీఆర్ 50 కోట్లు లంచం తీసుకుని ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని కంటోన్మెంట్ ప్రాంతం లోని ప్రతి ఒక్కరికీ తెలుసని ఆరోపించారు. 2023 జూన్ లోనే ఇచ్చిన CCLA కాపీని ఎమ్మెల్యే ఈరోజు సాక్ష్యాలతో సహా బహిర్గతం చేశారు

ఎమ్మెల్యే ఫిర్యాదుతో కంటోన్మెంట్ బోర్డులో అనుమతుల నిరాకరణ
ఆ భూములలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడానికి తాను ప్రయత్నం చేస్తున్నానని, ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని కంటోన్మెంట్ బోర్డు అధికారులకు తాను ఫిర్యాదు చేశానని, ఆ ఫిర్యాదుతో బోర్డు అధికారులు అక్కడ ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.

కోర్టు తీర్పుపై పోరాటం:
అప్పటి బీఆర్ఎస్ పెద్దలకు లంచం ఇచ్చి CCLA ద్వారా పొందిన కాపీని బోర్డుకి చూపించి, బోర్డు అనుమతులు తీసుకోవాలని ప్రయత్నించిన ప్రైవేటు వ్యక్తులకు తన ఫిర్యాదుతో బోర్డు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించి CCLA కాపీని చూపించి తమకు అనుకూలంగా తీర్పును తెచ్చుకున్నారని, బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ప్రజల పక్షాన తాను ఈ కేసులో ఇంప్లీడ్ అయి తీర్పును ఛాలెంజ్ చేస్తానని ప్రకటించారు. తప్పు చేసింది బీఆర్ఎస్ నాయకులైతే ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

303 కోట్లతో మాస్టర్ ప్లాన్: ఎలివేటెడ్ కారిడార్ల ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు సమకూరిన 303 కోట్లతో భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని బోర్డు సమావేశంలో అధికారులకు సూచించారు. నిరుపయోగ టాయిలెట్ల స్థానంలో పార్కులు: నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను కూల్చివేసి, వార్డు-7 వనిత ఎన్‌క్లేవ్ తరహాలో పార్కులు, మహిళా భవన్‌లు, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తే పిల్లలు, యువత, పెద్దల ఆరోగ్యానికి, వాకింగ్‌కు ఎంతో ఉపయోగమని తెలిపారు.

మడ్‌ఫోర్డ్ వాసులకు భరోసా:
మడ్‌ఫోర్డ్ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తారనే వదంతులతో భయపడుతున్న పేదలను స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని, ఎవరినీ ఖాళీ చేయనివ్వనని పేదవాడి గుడిసెకు ఎసరు వస్తే తాను ముందుండి అడ్డుకుంటానని, అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని భరోసా ఇచ్చారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments