రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన నేరెళ్ల సౌజన్య ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన TGT, PGTఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైంది. వివాహానికి ముందు ఇంటర్ వరకు చదివిన ఆమె భర్త సహకారంతో డిస్టెన్స్ మోడ్లో ఉన్నత చదువులు చదివింది. ఎలాంటి కోచింగ్ లేకుండా పట్టుదలతో మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు ఆమెను అభినందించారు.