రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర గ్రామానికి చెందిన గడ్డి రమేష్(42) 08.05.2024 రోజున సాయంత్రం 6:30 కు బయటకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి సమయంలో మద్యం సేవించి మా ఇంటికి వెళ్లే దారిలో నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుకు కొద్ది దూరంలో గల లింగం దేవయ్య వ్యవసాయ బావిలో పడినాడు. అయితే ఇట్టి విషయం వారికి తెలియక ఫిర్యాదు కుటుంబ సభ్యులు మృతుడి కోసం కోసం వెతుకుతుండగా, తేదీ: 09.05.2024 న రాత్రి 07:00 గంటల సమయంలో అట్టి బావిలో తన భర్త మరణించి పైకి తేలగా బావిలో నుండి బయటకు తీసి చూసినామని తెలిపి, అట్టి మరణం పైన ఎలాంటి అనుమానం లేదని, ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించినాడని మృతుడి భార్య స్వప్న దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ ఎన్ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపినారు.