నిరుపేద యువతి పెళ్లికి హిందూ సంప్రదాయం ప్రకారం మట్టెలు,పెళ్లి బట్టలు, గాజుల, పువ్వులు, తాంబూలం వితరణ చేసిన చేయూత ఫౌండేషన్ నిర్వాహకులు. చేయూత ఫౌండేషన్ నిర్వాహకులు అభేద బాను, శిరీష వృత్తిపరంగా టైలర్స్. తమ వద్దకు వచ్చి నిరుపేద కుటుంబంలో యువతి పెళ్ళికి మీ వంతు సహాయం చేయాలని యువతి తరుపున వారి బంధువులు సహాయాన్ని కోరగా విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు దూడపాక శ్రీనివాస్ కి తెలుపగా ఆ నిరుపేద యువతికి ఫౌండేషన్ ద్వారా మట్టెలు, పెళ్లికి కావలసిన చీర, టవల్, జాకెట్లు, గాజులు ఇవ్వటమే కాకుండా దాదాపు 5000 విలువైన మగ్గం, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనరి బ్లౌస్ లు ఉచితంగా కుట్టి ఇవ్వటంతో పాటు ఉచిత బహుమతి ఇచ్చారు. రానున్న రోజుల్లో చేయూత ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తామని సెక్రెటరీ ఆబేద బాను అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు సహాయం అందించాలనుకునే సామాజిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, యువత, దాతలుగా ముందుకు వచ్చి మా సంస్థ ద్వారా సహకారాన్ని అందించాలని కోరారు. దాతలు జమ్మికుంటలోని లోటస్ పాండ్ స్కూల్ ఎదురుగా ఉన్న బాను టైలర్ షాప్ లో సంప్రదించాలని కోరారు. ఈ సహాయానికి యువతి తల్లి, బంధువులు చేయూత ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతి బంధువులు స్వప్న, యువతి తల్లి రాధమ్మ, కవిత, వర్షిత, హసిన, మైముధ తదితరులు పాల్గొన్నారు.