రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వరి చంద్రమోహన్ పటేల్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సందర్భంగా పోతుగల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్‌బుక్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరి వెంకటేష్ మాట్లాడుతూ, “మా తమ్ముడు వరి చంద్రమోహన్ పటేల్ మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటాయి ఆయన ఆశయాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఈ విద్యాసామగ్రిని అందజేశామని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరి వెంకటేష్, వరి వికాస్, గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కోల కృష్ణ, వార్డు సభ్యులు జంగ రాజు, బోయ జోష్నా సంతోష్, చీకోటి మహేష్, కిట్టు, ఆకాష్, సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువత మరియు ఇతరులు పాల్గొన్నారు.


