జమ్మికుంటకు చెందిన మారపల్లి మొగిలయ్యకు బహుజన సమాజ్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలు అప్పగించిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్. ఇందుకు సహకరించిన సెంట్రల్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిశాని రామచంద్రానికి మారపల్లి మొగిలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థిగా పోటీచేసిన నాపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎల్లప్పుడూ పార్టీకి వెన్నంటి ఉంటానని నా వంతు సహాయంగా పార్టీని ముందుండి నడిపిస్తానని మారపల్లి మొగిలయ్య, విలేకరుల సమావేశంలో తెలిపారు