Thursday, October 22, 2026
spot_img
HomeANDHRA PRADESHహిందూపురం పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ.

హిందూపురం పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ.

హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు యం.యచ్. ఇనాయతుల్లా, హిందూపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ యం. ఇ కిఫాయతుల్లా ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ ఘనంగా జరిగింది. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళి అర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఇనాయతుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని పదవి అలంకరించి భారతదేశ ప్రజలకు సేవలు అందించిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి దక్కిందని ఆయన పదవీకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments