Wednesday, October 21, 2026
spot_img
HomeANDHRA PRADESHహోం మంత్రి అనిత ఆదేశాలతో విజయవాడ వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ

హోం మంత్రి అనిత ఆదేశాలతో విజయవాడ వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ

హోం మంత్రి అనిత ఆదేశాలతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి పాయకరావుపేట, కోటవురట్ల మండలాల టిడిపి నాయకులు విరాళాలు వేసుకుని విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నక్కపల్లి మండల టిడిపి అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ భారీ వరదలతో బుడమేరు వద్ద గండి కొట్టి విజయవాడలో పలు ప్రాంతాల ప్రజలు ముంపుకి గురై నిరాశ్రయులైనారని, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం నుండి నిత్యావసర వస్తువులు లారీ మీద తరలించి విజయవాడలో ఉన్న రాజరాజేశ్వరి నగర్లో ఉన్న వరద బాధితులకి నెల రోజులకు సరిపడు నిత్యావసర వస్తువులు, బట్టలు దుప్పట్లు మొదలుకు సామాగ్రి పంపిణీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాటి మనిషిగా సాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వైభోయిన రమణ, జానకి శ్రీను, పెద్దిరెడ్డి చిట్టిబాబు, కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు, తుమ్మల వెంకటరమణ, దేవర సత్యనారాయణ, గొనగాల రామకృష్ణ, దార్ల కృష్ణ, గింజాల శ్రీను, యాళ్ల చిరంజీవి, పైల సత్తిబాబు, అల్లు నరసింహమూర్తి, సుంకర బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments