కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న 130 పడకల ఆసుపత్రిలో అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మించడంతో 330 పడకల ఆసుపత్రిగా అవతరించింది. అందులో అదనంగా ఒప్పంద మరియు పొరుగు సేవల పద్ధతిలో కొన్ని పోస్ట్ ల నియామకాలు జరిగాయి. అందులో భాగంగా డయాలసిస్ కేంద్రం నిర్వహణ కోసం ఉండాల్సిన నిరంతర విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో జనరేటర్ తో నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దీని నిర్వహణ కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ బోర్డు నిధులు సమకురూస్తు వచ్చింది. కానీ కొంత కాలంగా వారు నిధులు సమకూర్చడం లేదు. గతంలో ఒప్పంద పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ లు, సెక్యూరిటీ గార్డ్ లు, ఎక్స్ రే, ఫార్మసిస్ట్ ల నియామకాలు జరిగాయి. వారి ఒప్పందం ముగుస్తున్న సందర్భంలో ఒప్పందం ముగిసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా భర్తీ చెయ్యడం మరియు వారికి ఏ పద్ధతిలో జీతాలు అందించాలనే విషయంలో గందరగోళం ఏర్పడిన పరిస్థితి నెలకొంది. కాబట్టి మెడికల్ కళాశాల కానీ దాని అనుబంధ ఆసుపత్రి కానీ యంత్రాలు పరికరాలు ప్రజలకు సంపూర్ణ స్థాయిలో ఉపయోగపడి, సేవలు అందించాలంటే ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకోవాలి. దాని నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లో డీజిల్ పోయడానికి రోగులే నిధులు సేకరించి డీజిల్ పోసే దయనీయ పరిస్థితి ఏర్పడింది. మేము కోరేది రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ సమన్వయం చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ 330 పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా దాని సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలి కోరుతున్నాం అన్నారు CPM రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు దుర్గం రాజ్ కుమార్, గొడిసెల కార్తిక్, జాదవ్ రాజేందర్, నేర్పెల్లి అశోక్ పాల్గొన్నారు.