దోహా: మాజీ చాంపియన్ స్పెయిన్.. ప్రపంచకప్‌ను ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్-ఈలో జరిగిన మరో మ్యాచ్‌లో స్పెయిన్ 7-0తో కోస్టారికాను చిత్తు చేసింది. డానీ ఓల్మో (11వ), మార్కో అసెన్సియో (21వ), ఫెర్నార్ టోరెస్ (31వ, 54వ), గవి (74వ), కార్లోస్ సోలర్ (90వ), అల్వరో మొరాట (90వ) స్పెయిన్ తరఫున గోల్స్ సాధించారు.