ఏలూరు: జిల్లాలోని అశోక్‌నగర్ శ్మశానవాటికలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లాష్ సంస్థ శ్మశానవాటికలో అంబులెన్స్‌లు, శవపేటికలు ఉంచుతోంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అధికారులు నిర్మాణాలను తొలగించింది. అనవసర ఆరోపణలతో నిర్మాణాలను తొలగించడం సరికాదని నిర్వాహకులు ఆవేదన చెందారు. అధికారుల తీరుపై సేవా సంస్థ నిర్వాహకులు మండిపడుతున్నారు. నిర్మాణాల తొలగింపుపై విపక్షాలు నిరసనకు దిగగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
శ్మశానవాటిలో అధికారుల ఓవరాక్షన్
RELATED ARTICLES