తూర్పుగోదావరి: విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
భారీ పేలుడు… ముగ్గురు మృతి
RELATED ARTICLES