కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏబీజేఎఫ్ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో, ఎన్నో సంఘాలు ఉద్యమంలో పాల్గొన్నారని, అదే దిశలో జర్నలిస్ట్ లు ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జరిగిన ప్రతి పోరాటంలో సడక్ బంద్ నుండి సంసాద్ యాత్ర వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు రోడ్ షో, ధర్నా, రాస్తా రోకో, వంట వార్పు, బతుకమ్మ, ఆటపాట, బైక్ ర్యాలీ, ఇలా అన్ని ఉద్యమాల్లో పాల్గొని ప్రతి సన్నివేశాన్ని దేశ, ప్రపంచంలోనీ నలుదిశల్లో పరిచయం చేస్తూ తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమాన్ని రాస్తూ, చూపిస్తూ ఒక ప్రత్యేక భూమిక పోషించిన ఘనత జర్నలిస్ట్ లదే నని పేర్కొన్నారు. జర్నలిస్ట్ గాని మీడియా గాని లేకుండా ఏ ఉద్యమం ఏ కార్యక్రమం ఏ పనిలో ఊపు ఉండదని, జూన్ 2 న జరుపబడే తేలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్ట్ లను గుర్తించాలని గడిచిన 10 ఏళ్లలో జర్నలిస్ట్ ల బ్రతుకులు మారలేదని, జర్నలిస్ట్ ల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకోలేదని, కేవలం పేపర్ స్టేట్మెంట్ కే పరిమితం అయిందన్నారు. గత ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో లో జర్నలిస్ట్ లకు అక్రిడిషన్ లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ నిలబెట్టుకోలేకపోయారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయిన మా జర్నలిస్ట్ ల సమస్యల పై దృష్టి సారించి “వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రిడిషన్ తో సంబంధం లేకుండా సంస్థ గుర్తింపు కార్డు కలిగి పని చేస్తున్న జర్నలిస్ట్లకు, ఇండ్ల స్థలాలు, వారి పిల్లల చదువుల్లో ఫీజు లో 50% రాయితీ కల్పిస్తూ, బస్సు, ట్రైన్ లో ప్రయనం కోసం ఉచిత పాస్ మంజూరు చేయాలనీ, ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలనీ కోరుతున్నామన్నారు. కార్పొరేషన్ రుణాలకు అవకాశం కల్పించాలని వేడుకుంటు, మా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని విన్నవిస్తూ, జూన్ 2 న జరపబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్ట్ లను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ మా జర్నలిస్టుల సమస్యల పై ద్రుష్టి సారించాలన్నారు.