Monday, October 7, 2024
spot_img
HomeNATIONALజాక్వెలిన్‌కు ముందస్తు బెయిలు

జాక్వెలిన్‌కు ముందస్తు బెయిలు

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న కేసులో ఆమెకు ముందుస్తు బెయిలు లభించింది. రూ. 50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు సమర్పించడంతో ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ ఆమెకు బెయిలు మంజూరు చేశారు.

మధ్యంతర బెయిలు గడువు ముగియడంతో ఈ రోజు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన వాదనలు వినిపిస్తూ.. నటి వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, కాబట్టి ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని ఆరోపించింది. స్పందించిన కోర్టు ఇప్పటి వరకు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. నటిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినప్పటికీ, దర్యాప్తు సమయంలో ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. మరో నిందితుడు జైలులో ఉన్నాడని, నచ్చని వారిని అరెస్ట్ చేసి, నచ్చిన వారిని వదిలేసే విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని ఈడీని నిలదీసింది.

జాక్వెలిన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ విచారణ ఇప్పటికే పూర్తయిందని, చార్జిషీట్ కూడా దాఖలు చేశారని కాబట్టి నటిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆగస్టు 31న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మాలిక్ జాక్విలిన్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. జాక్విలిన్‌ను పలుమార్లు ప్రశ్నించేందుకు పిలిచిన ఈడీ తొలిసారిగా సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును తొలిసారి ప్రస్తావించింది. అయితే, అంతకుముందు సమర్పించిన చార్జ్‌షీట్‌లో కానీ, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కానీ నటి పేరును ఈడీ ఎక్కడా నిందితురాలిగా పేర్కొనకపోవడం గమనార్హం. అయితే, వాటిలో జాక్వెలిన్, ఆమె సహ నటి నోరా ఫతేహి నుంచి తీసుకున్న వాంగ్మూలానికి సంబంధించిన వివరాలను ఈడీ పొందుపరిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments