రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ శివారులో మధ్యాహ్నం సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పదిర గ్రామం వైపు నుండి ఇసుకలోడుతో ఒక వాహనం రాగా దానిని ఆపి ఇసుక తరలించడానికి సంబంధించిన అనుమతులు లేనందున, వాహన డ్రైవర్ అయినా బురుక సాయిరాజ్ ను ప్రశ్నించగా నారాయణపూర్ గ్రామానికి చెందిన అతను ఎలాంటి అనుమతులు లేకుండా పదిర గ్రామంలో ఉన్న మానేరు వాగులో ఇసుక నింపుకొని దానిని కామారెడ్డిలో అమ్మడానికి వెళ్తున్నానని తెలపగా వెంటనే రవీందర్ రెడ్డి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఎస్సై ఎన్ రమాకాంత్ కు తెలిపి డ్రైవర్ పై, వాహన యజమాని పదిర గ్రామానికి చెందిన గండికోట కనుకయ్య పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.