రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని* ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ లోని రైతు ఖాతాదారుల రుణమాఫీ కాకపోవడం తో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న బ్యాంక్ కి వెళ్లి మేనేజర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే అర్హత కలిగిన రైతుల రుణ మాఫీ చేయాలని కోరారు. వీరి వెంట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, కెడిసిసిబ్యాంక్ చైర్మన్ గుండరపు కృష్ణరెడ్డి, రైతులు నెవూరి పద్మారెడ్డి, జగన్ రెడ్డి, దేవి రెడ్డి, గుండాడి వెంకట్ రెడ్డి, భూమయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పందిర్ల పర్శరములు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎడ్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు