Monday, May 20, 2024
spot_img
HomeTELANGANAఎల్లారెడ్డిపేట యువకులకు జాతీయ అవార్డులు

ఎల్లారెడ్డిపేట యువకులకు జాతీయ అవార్డులు

ఆదివారం హనుమకొండ టిఎన్జీవో భవన్ లో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు 2024 సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేష్ లకు జాతీయ అవార్డులను ప్రధానం చేశారు. కార్వింగ్ కళా రంగంలో అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుమ్మడికాయ, క్యారెట్ల తో కలిపి రామమందిరాన్ని తయారు చేసిన సందర్భంగా గుర్తించి విశిష్ట స్ఫూర్తి చిత్రకళా రత్న జాతీయ అవార్డును అందజేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ మండల ప్రజలకు మొక్కలను పంచుతూ పెంచుతూ కృషి చేసినందుకు విరాట్ విశ్వకర్మ సేవా రత్న జాతీయ అవార్డును అందజేశారు. ఈ అవార్డులను స్వచ్ఛంద సేవా సమితి చైర్మన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వలభోజు మోహన్ రావు, కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ సమక్షంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments