కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సిరిసిల్లకి చెందిన మాజిద్ ఖాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పోటీ పడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఓట్లతో (22,020) భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా మాజిద్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఇన్ని ఓట్లు వేసి గెలిపించిన రాష్ట్ర యువతకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. 2008 లో ప్రారంభం ఐన తన రాజకీయ జీవితంలో NSUI లో వివిధ హోదాలలో జిల్లా కార్యదర్శిగా, సిరిసిల్ల అధ్యక్షునిగా, తర్వాత యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సిరిసిల్ల అధ్యక్షునిగా, 2021 -22 మధ్య రాష్ట్ర కార్యదర్శిగా మరియు 2022-24 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో ఇపుడు మరింత ముందుకు పోతానని అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ, తనతో పాటు గెలిచిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.