రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జమ్మికుంట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం జీడి మల్లేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ ధరకు 500 రూపాయలు బోనస్ కలిపి కొంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక నేడు సన్న రకం వరి ధాన్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని దొడ్డు రకం వరి ధాన్యానికి బోనస్ ఇవ్వలేమని చెప్పి రైతులను మోసం చేశారని, జీడి మల్లేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన విధంగా దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, కానీ వరి కోతలు ప్రారంభమై రైతులు దిక్కుతోచని స్థితిలో తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు వరి ధాన్యం అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో తయారైందని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమేనని మల్లేష్ ఆరోపించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం అని అన్నారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించి, గన్ని సంచులు, సుతిలు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనట్లయితే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్లేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, కోరే రవీందర్, పల్లపు రవి, మేక సుధాకర్ రెడ్డి, ఇటికాల స్వరూప, మోడం రాజు బూరుగుపల్లి రామ్, రాచపల్లి ప్రశాంత్, A రామస్వామి, ముకుందం సుధాకర్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, యాంసాని సమ్మయ్య, A సృజన శ్రీ, తదితరులు పాల్గొన్నారు..