నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సులబ్ కాంప్లెక్స్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు అయితే సులబ్ కాంప్లెక్స్ లు చాలా అవసరం, పార్కింగ్ ప్లేస్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడైనా పార్కింగ్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి పార్కింగ్ లేదని వాహనాలకు చలాన్లు వేస్తున్నారు, చలాన్లు కట్టలేక వానదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో వాకర్స్, వ్యాయామాలు చేసే వారు చాలామంది ఉన్నారు వారికి ఎక్సర్ సైజ్ చెయ్యడానికి అవసరమైన పరికరాలు లేక మానసిక, శారీరక దృఢత్వం పొందలేకపోతున్నారు, అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ జిమ్ములకు వెళ్లలేని వారి కొరకు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కు వినతిపత్రం అందజేశారు. సులబ్ కాంప్లెక్స్, వాహనదారులకు పార్కింగ్ స్థలము, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని వీటితోపాటు స్వీట్ హౌస్, బేకరీలు, హోటల్స్ లలో సరైన నాణ్యత పాటించట్లేదని త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేయగా కమీషనర్ స్పందిస్తూ ఏవైతే సమస్యల పైన వినతి పత్రం ఇచ్చారో వాటిని తక్షణమే ఒక్కోటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్ పాల్గొన్నారు