ఏపీలో కూటమి ప్రభత్వం ఏర్పడి ఆ పై కొలువు తీరి నెల రోజులైన కాలేదు అప్పుడే తన మార్క్ ను పోలీస్ ఉన్నతాధికారుల బదిలీలలో చూపించింది. ఎన్నికల అనంతరం ఎస్పీల బదిలీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఎవరిని ఎక్కడ వేస్తారో అన్న సందేహనికి కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రంలో ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ జీఓ నెంబర్ 1252 తో ఉత్తర్వులు జారీ చేసారు. కొద్ది రోజుల క్రితమే పోలీస్ కమీషనర్లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఎస్పీలను బదిలీలు చేసింది. ఇటీవలే విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్నీకి పోస్టింగ్ ఇవ్వడం ఆపై ఆయన చార్జ్ తీసుకుని సీఎం చంద్రబాబు భోగాపురం ఏర్ పోర్ట్ సందర్శన తుతూ మంత్రంగా చేయడాన్ని ప్రభుత్వం కాస్త ఇబ్బందిగానే తీసుకుంది. దీంతో ఆయనన్ను అకస్మాత్తగా బదిలీ చేసింది. ఇక మొత్తం 30 మంది ఎస్పీల బదిలీలల్లో కూడా పనితీరు ఆధారంగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్పీగా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ను పొరుగు జిల్లా అయిన అనకా పల్లి వేయడం విశేషం. ఇక ఆమె భర్త అయిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. ఇలా మొత్తం 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.
APలో ఒకేసారి 30 మంది SPలను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం.!
RELATED ARTICLES