బొల్లారంలోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ ఇంజనీర్లు అధికారులతో సమీక్ష నిర్వహించి నాణ్యత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు కంటోన్మెంట్ MLA శ్రీ గణేష్. వీలైనంత తొందరగా ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ చిన్నపాటి లోపం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన ఎన్ని బ్లాకులు ఏ బ్లాక్ ఎక్కడ ఉంటాయని అడిగి తెలుసుకున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తుంది అని అన్నారు MLA శ్రీ గణేష్. ఇప్పటివరకు సరైన సమయంలో పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ఇంజనీర్లు తెలిపారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేపడుతుంది కార్పొరేట్ స్థాయికి మించి వైద్యం అందించడానికి టిమ్స్ హాస్పిటల్ సనద్ధమవుతుంది, ఈ టీమ్స్ ఆసుపత్రి ద్వారా చుట్టుపక్కల ఉన్న రెండు మూడు జిల్లాల పేద ప్రజలకు వైద్యం అందుతుంది ఇది చాలా సంతోషమని MLA శ్రీ గణేష్ అన్నారు. వెయ్యి నుండి 1200 వందల పడకలకు ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ప్రజలకు మరింత సదుపాయంగా ఉండే ఉద్దేశంతోనే ఆసుపత్రిని 1400 పడకలకు పెంచే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలాగా నా వంతు కృషి చేస్తానని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ ఇంజనీరులు, అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు…