Sunday, September 8, 2024
spot_img
HomeCINEMAరిషబ్ శెట్టి, రష్మిక మందన్నా మధ్య కోల్డ్ వార్!

రిషబ్ శెట్టి, రష్మిక మందన్నా మధ్య కోల్డ్ వార్!

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా. కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో వెండితెరపైకి రంగప్రవేశం చేసింది. అనంతరం పలు ఇండస్ట్రీస్‌లో మూవీస్ చేసి సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే రెండు చిత్రాలు చేసింది. కాంతార సినిమాపై అభిప్రాయాన్ని తెలపనందుకు కొన్ని రోజుల క్రితమే నెటిజన్స్ రష్మికను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై కూడా ఆమె స్పందించిన సంగతి తెలిసిందే. అయితే, రష్మికకు, కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

‘కిరిక్ పార్టీ’ కి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో అవకాశం ఏలా వచ్చిందని రష్మికను గతంలో అడగగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ‘‘ఫ్రెష్ ఫేస్‌గా ఓ మ్యాగజైన్‌పై నా ఫొటో ప్రచురితమయింది. ఆ పిక్‌ను చూసి ప్రొడక్షన్ హౌస్ నాకు సినిమాలో అవకాశం ఇచ్చింది’’ అని రష్మిక చెప్పింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రాలు ‘చార్లి’, ‘కాంతార’  లపై కూడా ఎప్పుడు తన అభిప్రాయాన్ని ఆమె వెల్లడించలేదు. వేరే సినిమాలకు మాత్రం శుభాకాంక్షలు చెబుతూ పలు మార్లు పోస్ట్‌లు పెట్టింది. దీంతో రిషబ్‌తో సహా కన్నడ అభిమానులు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. కొంత మంది అయితే ఆమెను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. రిషబ్ కూడా ఆమెపై ఉన్న కోపాన్ని పరోక్షంగా వెల్లడించాడు. సమంత, సాయిపల్లవి, రష్మికలలో మీకు ఎవరితో పనిచేయాలని ఉందనగా..’సమంత, సాయిపల్లవి అద్భుతంగా నటిస్తారు. వారితో పనిచేయాలని ఉంది. కొంతమంది హీరోయిన్స్‌తో అస్సలు పనిచేయాలనుకోవడం లేదు’’ అని చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments