జవ్వాజి కొమురయ్య సామిల్, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఏరియాలో సంచరిస్తున్న ఆడ నెమలి ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జవ్వాజీ కోమురయ్య కు చెందిన సామిల్ ఏరియాలో సమీప ఆడవుల నుంచి తప్పిపోయి వచ్చిన జాతీయ పక్షి ఆడ నెమలి సంచరిస్తుంది. కొమురయ్య సామిల్ లో పెంచిన చెట్లు దట్టంగా పెరగడంతో పాటు అక్కడ రెండు మూడు మామిడి చెట్టు, కొన్ని టేకు చెట్లు ఉండడంతో పాటు ప్రక్కనే ఆడేపు ఆంజనేయులు తన ఇంటి పరిసరాల్లో పూలమొక్కలు, నీడ నిచ్చే చెట్టు, కూరగాయల తోట ఉండడంతో పాటు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పరిసరాల్లో దట్టమైన చెట్లు ఉండడం పక్కనే బండారి వెంకటయ్య పశువుల కొట్టం ప్రక్కనే వారి పోలం పెంచుతున్న మామిడి చెట్లు, అల్లనేరేడు చెట్టు ఉండండముతో సమీప అడవుల నుంచి తప్పిపోయి వచ్చిన జాతీయ పక్షి ఆడ నెమలి కి స్థావరంగా మారి దానికి నీటినీ వసతి, ఆకలి తీర్చుకోవడానికి పచ్చి గడ్డి పుష్కలమైన వసతులున్నాయి, దీంతో ఈ ఏరియా లో ఆది సంచరిస్తుంది, టీవీల్లో, మొబైల్ ల్లో అడవి జంతువుల పక్షుల గురించి చూసి తెలుసుకుంటున్న జనం ప్రతిరోజు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉదయం సాయంత్రం అరుస్తున్న నెమలిని సహాజసిద్దంగా చూడ్డానికి గ్రామస్తులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.