IAS పూజ ఖేడ్కర్ ఉదంతం అనంతరం UPSC పరీక్షలలో వికలాంగుల కోటాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జస్ట్ అస్కింగ్ అంటూ బీఆర్ఎస్ [ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పు పట్టే విధంగా ఉన్నాయని సమస్త వికలాంగుల మనో భావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అంటూ మండిపడ్డారు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి, రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ.
ఈ సందర్భముగా స్మితా సబర్వాల్ కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ముంబై కి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ సురేష్ అద్వానీ గురించి మీకు తెలుసా ? ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి గారి గురించి మీకు తెలుసా? సివిల్స్ మొదటి ర్యాంకర్ హీరా సింఘాల్ మీకు తెలియద? స్టిపెన్ హాకింగ్ గురించి మీకు తెలుసా? వారందరు దివ్యాంగులే ఒకొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండ మీ లాంటి IAS, IPS లకు ఆధర్శంగా నిలిచారని అంటూ లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈరోజులలో మీరు ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వాఖ్యలు చేయడం సబబు కాదని అందచందాలను చూసి పదవులు ఇవ్వరు వారి వారి తెలివి తేటలను వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇస్తారని 2016 వికలాంగుల చట్టం ప్రకారం స్మీత సబర్వాల్ యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.


