Tuesday, January 21, 2025
spot_img
HomeTELANGANAజమ్మికుంట లో బిజెపి 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జమ్మికుంట లో బిజెపి 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బిజెపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ బిజెపి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన డాక్టర్ సమప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయల ఆలోచన విధానాలకు అనుకూలంగా వారి స్ఫూర్తితో బిజెపి పార్టీ ఆవిర్భవించిందని తెలియజేశారు. బిజెపి జాతీయ ప్రథమ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్ పాయ్, అతనికి అండగా లాల్ కృష్ణ అద్వానిలు పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

1984లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలు గెలుపొందగా, అందులో హనుమకొండ పార్లమెంటు నియోజక వర్గం ఒకటని ఆనాడు జమ్మికుంట ప్రాంతం హనుమకొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేదని గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ ఈ దేశానికి ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందించారని వారి స్ఫూర్తితో ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా ఒకపక్క పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే దేశాన్ని ముఖ్యంగా రక్షణ, అభివృధి అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. నరేంద్ర మోడీ. పరిపాలనలో అన్ని వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారని మళ్లీ ఈ దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలు కూడా నరేంద్ర మోడీ కి మద్దతుగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

బిజెపి కార్యకర్తలందరూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు కష్టపడి పనిచేసి బండి సంజయ్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు పోలింగ్ కేంద్రం స్థాయిలలో బీజేపీ కార్యకర్తలు టిఫిన్ బైఠక్ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ విషయాలను ఉమ్మడిగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, కోరే రవీందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, మోతే స్వామి, ఇటికాల సరూప, తూడి రవిచంద్ర రెడ్డి, కొలకాని రాజు, మేక సుధాకర్ రెడ్డి, ఠాగూర్ రాకేష్, బల్సుకురి రాజేష్, మోడేం రాజు, గండికోట సమ్మయ్య, కొండ్లె నాగేష్, బచ్చు శివకుమార్, బూరుగుపల్లి రామ్, రాచపల్లి ప్రశాంత్, గర్రపల్లి నిరుప రాణి, శనిగరపు రవి, ఇల్లందుల శ్రీనివాస్, గుర్రం పరశురాం, ముకుందం సుధాకర్, కొండపర్తి ప్రవీణ్, అప్పల రవీందర్, యాంసాని సమ్మయ్య, పత్తి జనార్దన్ రెడ్డి. జడల శ్రీనివాస్, శ్రీవర్తి అఖిల్, మంతిని అశోక్, కనమల లక్ష్మి, భాగ్య, కేశ సరూప, చుక్కల గంగా భవాని, కొండ్ర సులోచన, మైస లక్ష్మి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments