Wednesday, January 14, 2026
spot_img
HomeANDHRA PRADESHఎ మల్లవరం గ్రామ ప్రధాన సమస్యలు MLA సత్యప్రభ దృష్టికి తీసికెళ్లిన గవిరెడ్డి గురునాధ్

ఎ మల్లవరం గ్రామ ప్రధాన సమస్యలు MLA సత్యప్రభ దృష్టికి తీసికెళ్లిన గవిరెడ్డి గురునాధ్

రౌతులపూడి మండలం ఎ మల్లవరం గ్రామ ప్రధాన సమస్యలు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దృష్టికి తీసికెళ్ళి పరిష్కరించాలని కోరినట్లు గ్రామ టిడిపి యువ నాయకుడు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, కాకినాడ పార్లమెంట్ ఎక్స్ ఆఫీషియో మెంబెర్ గవిరెడ్డి గురునాధ్ మీడియాకి తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రౌతులపూడి మండలం ఎ మల్లవరం గ్రామంలో బిసి కాలనీలో మెయిన్ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నీరు వెళ్ళే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే ఉంటుందని, తక్షణమే డ్రైనేజీ సమస్యకి నిధులు కేటాయించి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని, కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని, బలరామపురం నుండి ఎ మల్లవరం మీదుగా లచ్చిరెడ్డిపాలెం, బీబీ పట్నం జంక్షన్ వరకు బీటీ రోడ్డు వేయించాలని, ఊరుని ఆనుకుని ఉన్న స్మశానానికి ప్రహరీ గోడ నిర్మించాలని లేదా స్మశానాన్ని ఊరుకి దూరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని, మా గ్రామానికి 24 గంటలు కరెంట్ వచ్చేవిదంగా కొత్త లైన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ ని, స్కూల్లో ఉన్న బిల్డింగ్ ని పూర్తిగా నిర్మాణం జరిగేలా నిధులు మంజూరు చేయించాలని గవిరెడ్డి గురునాధ్ ఎమ్మెల్యే సత్యప్రభని కోరగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments