కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల తహసిల్దార్ రజని ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి అదేవిధంగా హనుమకొండలోని కె.ఎల్.ఎన్ రెడ్డి. కాలనీలో కూడా రజని దగ్గరి బంధువుల ఇండ్లలోకూడా ఏకకాలంలోనే సోదాలు కొనసాగుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నట్టు సమాచారం. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.