ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా నియామకమైన డా. మహమ్మద్ రియాజ్ (పీసీసీ అధికార ప్రతినిధి, మ్యానిఫెస్టో కమిటీ మెంబెర్ )ను శనివారం తెలంగాణ రాష్ట్ర నూర్ భాష సంఘ ప్రధాన కార్యదర్శి జమ్మికుంట కు చెందిన మహమ్మద్ అంకూస్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారితో దుదేకుల నూర్ భాష కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించాలని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని సంఘం సమస్యలు విన్నవించాలని కోరగా సానుకూలంగా స్పందించి సంఘం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు మహమ్మద్ అంకూస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ భాష నాయకులు మహమ్మద్ అమన్, రియాజ్, అన్వర్ పాల్గొన్నారు.