హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం బిజీగీర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాలొ మాజీ మంత్రి ఈటెల రాజేందర్
జన్మదినం సందర్భంగా బుధవారం రోజున దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించిన జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు. మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. మైనార్టీ నాయకుడు మహమ్మద్ నసిరుద్దీన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఆయురారోగ్యాలతో బాగుండాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ నసిరుద్దీన్, మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ యాకూబ్, మహమ్మద్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.