గులాబీ దళపతి కేసీఆర్ గురువారం జమ్మికుంటకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కెసిఆర్ రోడ్ షో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జరగనుంది. సాయంత్రం 6 గంటలకు బస్సు యాత్ర జమ్మికుంటకు చేరుకుంటుంది. రోడ్ షో అనంతరం కెసిఆర్ వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. కెసిఆర్ రోడ్ షో ను పురస్కరించుకొని జమ్మికుంటలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మికుంట గులాబీ మయమైంది. విద్యుత్ దీపాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో జమ్మికుంటను నింపేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చే వాహనాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ గ్రామం నుండి డప్పు చప్పులతో నృత్యాలతో ఉత్సాహంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.అన్ని తానై.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.