ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఐపీఎల్‌ను ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో పోల్చాడు. ప్రస్తుతం అతను ఆండీ ఫ్లవర్ స్థానంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. ‘ఐపీఎల్ అతిపెద్ద టోర్నమెంట్. ఒలింపిక్ గేమ్స్ తరహాలోనే పోటీలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తిలకించే ఈ టోర్నీలోని ప్రతీమ్యాచ్ ప్రేక్షకుల సందడి మధ్య అద్భుతంగా సాగుతుంటుంది. ఇలాంటి టోర్నీలో నేను కూడా భాగం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది’ అని లాంగర్ తెలిపాడు.