కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 400 మంది పైగా కరీంనగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాల్రెడ్డి, సూడిద రాజేందర్, మాజీ జెడ్పిటిసి ఏలూరు రాజయ్య, దత్తాత్రే గౌడు, మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాల్రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, గుండాడి రాంరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గన్న శోభ, బుర్కా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



