రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాయి పల్లె గ్రామ రైతులు సాగునీటి కోసం మండల తహశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఱ్ఱయపల్లి గ్రామం పైన ఉన్న చింతలచెరువు లోకి నీళ్ళు రాకుండా చికోడు గ్రామ రైతులు కొందరు మల్లన్న సాగర్ కాలువలో అడ్డంగా సంచులు వేశారని, ఆ సంచులు తొలగించి చెరువును నింపి మా పొలాలకు సాగునీరు వచ్చేలా చేయాలని ఎండిపోతున్న మా పొలాలకు నీరు అందేలా చేయాలని రైతుల కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొర్రాయి పల్లె గ్రామ రైతులు సిహెచ్ యాదగిరి, పద్మా రెడ్డి, దేవయ్య, మల్లేషు, శ్రీనివాసు, ఎల్లం, బాలయ్య, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.