బదిలీపై వెళుతున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను సాన్మనించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ రోజు ములుగు డిఎల్ఆర్ గార్డెన్ లో ములుగు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తించి బదలీ వెళ్తున్న తస్లీమా గారిని వారి కుటుంబ సభ్యులను శాలువా తో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఉద్యోగిగా, సమాజ సేవకురాలిగా తస్లీమా చేసిన సేవలు ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ములుగు ప్రాంతంలో 13 సుదీర్ఘకాలంగా బాధ్యతలు నిర్వర్తించిన తస్లీమా, ఇటీవలే రాష్ట్రంలో జరిగిన సాధారణ బదిలీలలో మహబూబాబాద్ కి బదిలీ అవడం బాధాకరం అని ఉద్యోగులకు బదిలీలు సహజమని, ఎక్కడ ఆకలి కేకలు వినిపించిన అయిన వారికి దూరమై ఎవరు కంట కన్నీరు పెట్టిన ఆమె అక్కడ ప్రత్యక్షమవుతారని, ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళిన, మీ సేవలను ఈ ప్రాంతంలో కొనసాగించాలని,ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజలు మీకు అండగా ఉంటారని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
బీసీ సెల్ మండల అధ్యక్షులు ఓం ప్రకాష్, ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గందే శ్రీను, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుంటోజు శంకరయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి, బీసీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ బోయిన రమేష్, జాఫర్ హజి, గణేష్ తదితరులు ఉన్నారు