రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో మహాత్మా సావిత్రి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. సావిత్రి పూలే ఉపాధ్యాయురాలుగా ఎనలేని సేవలు చేశారని లింగ వివక్ష బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను అర్పించిన మహా నేత అని ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఈరోజు మహిళా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. వితంతు మహిళలకు చదువుకుని అవకాశం కల్పించిన మహనీయురాలు లింగ వివక్షను సమాజంలో ధైర్యంగా ఎదుర్కొన్న వీర వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఎలుసాని ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, గ్రామ కార్యదర్శి జాఫర్, నాయకులు మాజీ ఉపసర్పంచ్ మహేందర్, ఎండి మాజీద్, నిమ్మ నారాయణరెడ్డి, మల్లారెడ్డి బత్తుల నర్సయ్య, ఎలవేణి లింగం, జెల్ల సత్తయ్య, మామిండ్ల బాల నర్సు, అనుప దుర్గయ్య, నాంపల్లి, జెల్ల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.



