మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ బండి సంజయ్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పాషా కు ఫిర్యాదు చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్ట ప్రకారంగా ఎంపీ బండి సంజయ్ కి శిక్ష విధించాలని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రాజకీయాలలో విమర్శించుకోవడం సహజం కానీ తల్లి చెల్లి భార్యలను రాజకీయాల కోసం వారి పేర్లను బహిర్గతం చేయవద్దని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ ఓటమి చెందుతాడని భయం పట్టుకుందన్నారు. ఒక ఉన్నత హోదాలో ఉండి చిల్లర రాజకీయాలు చేయడం తగదని బేషరతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్, కొండాపురం శ్రీనివాసరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు చెన్ని బాబు, గంట బుచ్చగౌడ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు