రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సి ఐ సదన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం రోడ్డు భద్రత ప్రమాద నివారణపై అవగాహన కల్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు రోడ్డుపై వరిధాన్యం కుప్పలు పోయడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత రైతులపై కేసు చేసిపెట్టడం జరుగుతుందన్నారు. దయచేసి రైతులు ధాన్యం వలన ప్రమాదాలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందని తెలిపారు.


