సామాన్య కార్యకర్త నుండి జాతీయ కార్యాలయ ఇంఛార్జి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన చేకూటి అనూష్ యాదవ్ ని బిజెపి యువ మోర్చ జాతీయ కో ఆర్డినేటర్ గా నియమించి నేడు నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడు సేవెళ్ళ మహేందర్. యువ మోర్చ మండల ప్రధాన కార్యదర్శిగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ విస్తారక్ గా, మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ విస్తరక్ గా, మెదక్ పార్లమెంటు సహా విస్తరక్ గా, చేసిన పనిని పార్టీ గుర్తించి ఈ బాధ్యత ఇచ్చిన రాష్ట్ర పార్టీ కి అనూష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. బిజెపి పార్టీలో పని చేసే సామాన్య కార్యకర్తను కూడా గుర్తిస్తారనే దానికి నేనే ఉదాహరణ అని అనూష్ అన్నారు. నా ఈ నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నకు బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పార్టీ నాయకులకు, తోటి కార్యకర్తలకు అనూష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు