రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో సిఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ లపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద సుమారు 90 వేల రూపాయలకు పైగా విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినట్లైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరంచారు.