జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏరడవెల్లి గ్రామానికి చెందిన హనుమంతరావు ఇటీవల అకాల మరణం చెంది నేటికీ 9వ రోజు అయినందున రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్ కరీంనగర్ సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి నగరంలోని హనుమంతరావు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజకీయపరంగా హనుమంతరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు.