వేములవాడ నియోజకవర్గ పరిధిలో బుధవారం రోజున పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ నేను హిందువుని, మాంసాహారం కూడ తినను, రాముని జన్మభూమి ఎక్కడ అని నేను అనని మాటలను అనడం కరెక్ట్ కాదు, అనే వాడు మూర్కుడు నేను ఒక వేళ అంటే సజీవ దహనానికి నేను సిద్దం అని అన్నారు. అమ్మ ప్రస్తావన తీసుక వచ్చింది ఎవడు, హుస్నాబాద్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మా అమ్మ ఆత్మ ఘోషిస్తుందని అన్న వెదవ ఎవడు, సిగ్గులేకుండా అమ్మ కాళ్ళు మొక్కుతా అంటున్నవా ఏనాడూ అయిన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న గుడికి నీవు ఎం చేశావ్ బండి సంజయ్ ఎన్నికల్లో ఓట్ల కోసం పెండ్లాం మంగళ సూత్రాలు అమ్ముకున్న నీవు ఇలా మాట్లాడుతావా ఎంపీగా గెలిస్తే నన్ను రాజీనామా చేస్తావా అంటావా సిగ్గు ఉందా అని అన్నారు. మూడు వందల మంది పోలీసులతో యాత్ర చేస్తున్నావ్ ఎందుకు ఇంత ఆర్భాటం అన్నారు