విశాఖపట్నం: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండాలి.. ఏపీలో ఎందుకు? అని ప్రశ్నించారు. ఏపీలోకి బీఆర్ఎస్ రావడం కరెక్ట్ కాదన్నారు. ఆంధ్రులను ఎన్నో మాటలు ఆడారని.. రాష్ట్ర విభజన కారకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విపరీతమైన అలజడులు సృష్టించారని ఆరోపించారు. ఏపీలో కాపులను ఆకర్షించి… పవన్ కల్యాణ్ ను కంట్రోల్ చేయాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఉందని అన్నారు. పవన్‌ను కంట్రోల్ చేయడం జగన్‌కే సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. ర్యాలీలు, రోడ్ షోలు జరపకూడదని జగన్ ప్రభుత్వం చీకటి జీఓను తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాజకీయ నాయకులు రోడ్లపైకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. జనంలోకి జగన్ రావడానికి భయపడుతున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండాలి మనకు ఎందుకు?
RELATED ARTICLES