స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అంబేద్కర్ కాలనీ లో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెల్త్ క్యాంపు నిర్వహించారు. కాలనీలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు మరియు ఎన్ సి డి పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత సీజనల్ డిసీజెస్ వర్షాకాలంలో సంబంధించిన వ్యాధుల మీద డ్రైడే మీద అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మందులు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మహోన్నత, వార్డ్ కౌన్సిలర్ గుల్లి పూలమ్మ, వార్డ్ స్పెషల్ ఆఫీసర్, సూపర్వైజర్ రత్నకుమారి, ఏఎన్ఎం మంజుల, రజిత మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..